ప్రభాస్ మెత్తబడ్డాడట ఎందుకో తెలుసా ?

ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీ బాహుబలి. ఈయనతో పాటు ఉండే సహా నటులంతా పెళ్లిళ్లు చేసుకొని పిల్లాపాపలతో హ్యాపీ గా సినిమాలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. మొన్న అల్లరి నరేష్, నిన్న వచ్చిన నాని, రామ్ చరణ్, జూనియర్ ఎన్ఠీఆర్, ఇలా వీళ్లంతా హ్యాపీ గా ఫ్యామిలీ లైఫ్ ను గడుపుతుంటే హీరో ప్రభాస్ మాత్రం బ్యాచిలర్ గా కొనసాగుహఃతూనే ఉన్నారు. ఈయన పెళ్లి జరిగితే కానీ నిద్రపోని సినీ వర్గం ప్రభాస్ పెళ్లి ఎప్పుడని ఈయన పెద్ద నాన్న అయిన కృష్ణం రాజు ను కనిపించిన వారందరూ మొదటి ప్రశ్నగా వేస్తున్నారు.

ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని అడిగాకే మిగతా బాగోగులు అడుగుతున్నారని ఈమధ్య కృష్ణం రాజు కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.. ప్రభాస్ పెళ్లి కృష్ణం రాజుకు తలపోటు గా మారింది. ఈ పోటు ను తట్టుకోలేక ప్రభాస్ ను పెద్ద నాన్న పెళ్లి చేసుకోమంటూ విసిగించడం మొదలు పెట్టాడట. దీనికి మొదట్లో ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకురావడం తోనే కస్సు బస్సు మని కసిరేంత పని చేసేవాడట.. అది తప్ప ఏ టాపిక్ అయినా మాట్లాడమంటూ విసుక్కునే వాడట ప్రభాస్. అయితే రీసెంట్ గా కృష్ణం రాజు బర్త్ డే సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సేమ్ ప్రశ్న ఎదురయ్యింది పెద్దాయనకు.

అంతే అతను కూడా విసిగెత్తి పోయిన వాడిలానే ఆన్సర్ చేస్తూ ఆ ప్రశ్న ప్రభాస్ నే అడగొచ్చుగా అని చమత్కారం చూపిస్తూనే ప్రస్తుతం ప్రభాస్ ఆలోచనలో పడ్డాడు.. ఇద్దువరకు పెళ్లి ప్రస్తావన వస్తే వచ్చే ఏడాది చేసుకుంటా అని మాట దాటేసేవాడు.. కానీ ఇప్పుడిప్పుడే విసుక్కునే స్థాయి నుంచి చూద్దాం అనే వరకు వచ్చాడు. పెళ్లి విషయం లో మెత్తపడ్డాడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే త్వరలో ప్రభాస్ అతి త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతాడని అర్థమవుతోంది… ఈ బాహుబలిని చేసుకునే అదృష్టం మాత్రం ఎవరిని వరిస్తుందో చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *