కాజల్ చేసినవి నిద్రలోనూ వెంటాడుతుంటాయట పాపం…

ఇండస్ట్రీలో హీరోలకంటే పోటీ తక్కువే గానీ.. హీరోయిన్స్ కు మాత్రం చాలా ఎక్కువనే చెప్పాలి కానీ దక్షిణాదిన అగ్ర కథానాయికగా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ వృత్తిపరంగా ఎంత పోటీ ఎదురవుతున్నా నేటికీ తన జోరును చూపిస్తోంది. ప్రస్తుతం తెలుగులో కల్యాణ్‌రామ్‌తో కలిసి ‘ఎమ్‌.ఎల్‌.ఎ’లో నటిస్తోంది. నాని నిర్మిస్తున్న ‘అ’లోనూ కీలక పాత్ర పోషించింది.

విరామం లేకుండా ఏకధాటిగా పనిచేశాక, ప్రశాంతత కోసమని నచ్చిన ప్రదేశాలకి వెళ్లే కథానాయికల్ని చాలామందినే చూస్తుంటాం. మీరూ అంతేనా అని కాజల్‌ని అడిగితే ఆసక్తికర సమాధానం ఇస్తోంది. నా ఆనందాలన్నీ అందుబాటులోనే ఉంటాయి. కచ్చితంగా ఫలానా ప్రదేశానికి వెళ్తేనే సంతోషంగా ఉంటుందనేమీ లేదు. ఇంటికి వెళ్లి కాసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆ తర్వాత అక్కడే నచ్చిన సినిమా చూసేసి, మళ్లీ సాయంత్రం స్నేహితులకి కాల్‌ చేసి బయటికి బయల్దేరామంటే చాలు. ఇంకేదీ గుర్తుండదు.

అలాఅని విహారం కోసం విదేశాలకి వెళ్లనని కాదు. అక్కడో రకమైన ప్రశాంతత, ఆనందం అంతే. వేరే రంగాలతో పోలిస్తే సినిమా భిన్నం. పతాక స్థాయి సృజనాత్మకత ఇక్కడ కనిపిస్తుంటుంది. ఒప్పుకొన్న సినిమాల కోసం కొన్నిసార్లు నిర్విరామంగా పనిచేయాల్సి వస్తుంది. కొన్ని కథలు, చేసే పాత్రలు నిద్రలోనూ వెంటాడుతుంటాయి. ఆ ఒత్తిడి నుంచి అప్పుడప్పుడు బయటికి రావల్సిందే. అలాంటి సందర్భాల్లోనే నాకు నచ్చిన పనులన్నీ చేస్తుంటా. అంతే తప్ప ప్రశాంతత, సంతోషం కోసమని ప్రతిసారీ ప్రత్యేకంగా ఖరీదైన కలలు కనను అని చెప్పుకొచ్చింది కాజల్‌…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *