త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఆవిష్క‌రించిన‌ `విష‌పురం` ట్రైల‌ర్!

లింక‌న్ మెథ‌డ్ ప్రొడక్ష‌న్ ప‌తాకంపై ష‌ఫీ, శ్రావ‌ణి, యాద‌వ్‌, ప్ర‌ధాన పాత్ర‌లో జాంబి జాన‌ర్ లో శ్రీనివాస్ సందిరి ద‌ర్శ‌క‌త్వంలో భోగారి లక్ష్మీనారాయ‌ణ‌, పాతూరి బుచ్చిరెడ్డి,భోగారి రాజు, పాతూరి మాధ‌వ‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `విష‌పురం`లో ఒక‌రోజు. ఈ చిత్రం ట్రైల‌ర్ లాంచ్ సోమ‌వారం ప్ర‌సాద్ ల్యాబ్స్ లో త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ చేతుల‌మీదుగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా త‌మ్మారెడ్డి భ‌రద్వాజ మాట్లాడుతూ…“హాలీవుడ్ లో జాంబి జాన‌ర్ సినిమాలు చాలా వ‌చ్చాయి. కానీ మ‌న ద‌గ్గ‌ర ఆ జాన‌ర్ లో సినిమాలు రాలేద‌నే చెప్పాలి. సిద్దిపేట లోని లోక‌ల్ టాలెంట్ తో జాంబి జాన‌ర్ లో సినిమా చేస్తోన్న `విష‌పురం` ద‌ర్శ‌క నిర్మాత‌లకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ట్రైల‌ర్ చూస్తుంటే ఇంట్ర‌స్టింగ్ గా , చాలా భ‌య‌పెట్టే విధంగా ఉంది. ఓ కొత్త ప్ర‌య‌త్నం చేస్తోన్న ఈ టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నా“ అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ…“లోక‌ల్ ఆర్టిస్ట్ ల‌ను తీసుకుని ఈ సినిమా చేశాం. ష‌ఫీ గారి పాత్ర సినిమాకు కీల‌కంగా ఉంటుంది. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా న‌న్ను న‌మ్మి ఈ సినిమా చేసారు. మా టీమ్ అంతా కూడా సినిమా కోసం ఎంతో శ్ర‌మించారు. ముఖ్యంగా ష‌ఫీ గారు ఎంతో కేర్ తీసుకుని చేసారు. కెమెరా వ‌ర్క్, నేప‌థ్య సంగీతం సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లాయి. అడిగిన వెంట‌నే ఎవ‌రు? ఏంట‌ని అడ‌గ‌కుండా ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన త‌మ్మారెడ్డిగారికి మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నా. వారిలా ప్రోత్స‌హిచే వారుంటే మ‌రెంతో మంది ద‌ర్శ‌కులు, ఆర్టిస్టులు సినిమా ప‌రిశ్ర‌మ‌కు వ‌స్తారు. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తార‌ని ఆశిస్తున్నాం“ అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ….“మాకు వ్యాపారం రంగ త‌ప్ప ,సినిమా రంగం చాలా కొత్త‌. మా ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో నూత‌న న‌టీనటుల‌ను ప్రోత్స‌హిస్తూ `విష‌పురం` చిత్రాన్ని నిర్మించాం. ద‌ర్శ‌కుడు ఈ సినిమా కోసం అన్నీ తానై శ్ర‌మించాడు. మాకు చెప్పిన‌దానిక‌న్నా సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడు. మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకుంటార‌ని ఆశిస్తున్నాం“ అన్నారు.

ష‌ఫీ, శ్రావ‌ణి, యాద‌వ్, రాజు గౌటి, మల్లేష్ యాద‌వ్‌, దేవా, రాము త‌దిత‌రులు న‌టిస్తున్న ఈచిత్రానికి సంగీతంః శ్రీ వెంక‌ట్, కెమెరాః కిష‌న్ తిప్ప‌ర‌వేణి, ఆర్ట్ః శ్రీధ‌ర్ సందిరి; నేప‌థ్య సంగీతంః రోహిత్ జిల్లా; డైలాగ్స్ఃమ‌హేష్ య‌ల్‌; కో-ప్రొడ్యూస‌ర్స్ః ర‌మేష్ బండి, బి.వెంక‌టేశం; నిర్మాత‌లుః భోగారి ల‌క్ష్మినారాయ‌ణ‌, పాతూరి బుచ్చిరెడ్డి, భోగారి రాజు, పాతూరి మాధ‌వ‌రెడ్డి, క‌థ‌-స్ర్కీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంఃశ్రీనివాస్ సందిరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *