`తొలి ప‌రిచ‌యం` రివ్యూ

వెంకీ, లాస్య కలిసి  ఎల్. రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో పక్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణం లో  `తొలి ప‌రిచయం` చిత్రం  నేడు ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చింది. ఆ సినిమా క‌థా ఏంటో ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం.

క‌థ‌: వెంకీ, హ‌రిణి(లాస్య‌)లు పెళ్లికి వ్య‌తిరేకులు. పెళ్ళి మాట‌త్తితే మండిప‌డిపోయో మెండి ఘ‌టాలు. పెళ్ళి చేసుకుంటే స్వ‌తంత్రం కోల్పోతామ‌ని వెంకీ.. స‌మాజంలో కొంత మంది భ‌ర్త‌లు భార్య‌ల‌ను హింసిస్తున్నార‌నే కార‌ణంగా  పెళ్లిపై  విర‌క్తి పెంచుకున్న లాస్య ల మ‌ధ్య జ‌రిగే సింపుల్ స్టోరీ. వెంకీ, లాస్య ల నాన్న‌లిద్ద‌రు రిటైర్డ్ మాష్టారు( ముర‌ళీ మోహ‌న్ ) కు ప్రియ శిష్యులు. స్కూల్ బిల్డింగ్ ప్రారంభానికి ఆ మాష్టారు శిష్యులు ఇద్ద‌ర్నీ ఆహ్వానిస్తాడు. కానీ కొన్ని కార‌ణాల వల్ల హీరో, హీరోయిన్ తండ్రులు వెళ్ల‌డం కుద‌ర‌క‌పోవ‌డంతో వెంకీ,లాస్య‌ల‌ను పంపిస్తారు. అలా ఇద్ద‌రు అనుకోకుండా ఓ  ప‌డ‌వ ప్ర‌యాణంలో క‌లుసుకుంటారు. త‌ర్వాత వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి?  పెళ్లి అంటే గిట్ట‌ని వారిద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డారా?  రిటైర్డ్ మాష్ట‌ర్ ముర‌ళీ మోహ‌న్ ఎందుకు రెండ‌వ పెళ్లి చేసుకున్నాడు?  రాజీవ్ క‌న‌కాల క్యారెక్ట‌ర్ ఎలాంటిది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాల‌సిస్:   హైద‌రాబాద్ లో ప్రార‌భ‌మైనా కాసేప‌టికే స్వ‌చ్ఛ‌మైన ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలోకి వెళ్లిపోతుంది.అంద‌మైన ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే క‌థ ఇది.  మాష్టారు కోసం ప‌ల్లె కి చేరుకున్న జంట మ‌ధ్య స‌న్నివేశాలు చాలా బాగున్నాయి. ప‌ల్లెల్లో ప్ర‌జ‌ల జీవితాలు ఎలా ఉంటాయి?  వాళ్ల వేషాధార‌ణ‌? ముఖ్యంగా  చేప‌లు జీవ‌నాధ‌రంగా బ్ర‌తికే వాళ్ల మ‌ధ్య బాంధావ్యాలు ఎలా ఉంటాయి? అనేది ద‌ర్శ‌కుడుచూపించిన విధానం ప్రేక్షకులని ఫిదా చేస్తుంది.మాస్టారు రెండ‌వ పెళ్లి చేసుకున్నాడ‌ని తెలుసుకున్న వెంకీ, హ‌రిణిలు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇలాంటి త‌ప్పుడు మ‌నిషి కోసం ఇంత దూరం వ‌చ్చామా? అనే స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా కాస్త ఆసక్తిని కలగజేస్తాయి.   క‌థ‌ను కేవ‌లం  ఐదారు పాత్ర‌ల‌తోనే న‌డిపించాడు. హీరో, హీరోయిన్ల మ‌ధ్య ఒక క‌మెడీయ‌న్ పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. మ‌ధ్య‌లో వైవా హ‌ర్ష హ‌రిణిని ఇష్ట‌ప‌డ‌టం…రిలాక్స్ టైమ్ లో ఫోన్ చేసి విసిగించే స‌న్నివేశాలు న‌వ్వు తెప్పిస్తాయి. ఆ పాత్ర‌ను సంపూర్ణంగా వాడుకుని ఉంటే ఇంకొంచం మెరుగ్గా ఉండేది. పెళ్లిని వ్య‌తిరేకించే వాళ్ల‌కు క్లైమాక్స్ లో చిన్న‌పాటి సందేశం చాలా బాగుంటుంది.మురళి మోహన్ నటన అద్బుతంగా ఉంది, ఆయన గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదని మనకు తెలిసిందే. మొత్తానికి సినిమా బాగుంది.

న‌టీన‌టులు: హీరో, హీరోయిన్లు ఇద్ద‌రు కొత్త వాళ్లైనా బాగా న‌టించారు. క‌థానుగుణంగా ఆ పాత్ర‌ల్లో స‌హ‌జ‌త్వం బాగుంది. ర‌ఘుబాబు మ‌తిమ‌రుపు పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుంది. వైవా హ‌ర్ష కామెడీ బాగుంది. అయితే ఆ పాత్ర‌కు ఇంకా వెయిట్ ఇచ్చుంటే బాగుండేది. మిగ‌తా పాత్ర‌లు ఫ‌రిది మేర న్యాయం చేసాయి.

సాంకేతిక‌వ‌ర్గం: స్వ‌చ్ఛ‌మైన ప‌ల్లెటూరి క‌థ బాగుంది. సంగీతం..ఆర్ .ఆర్ చ‌క్క‌గా కుదిరాయి. ఛాయాగ్రాహ‌ణం బాగుంది. అంద‌మైన ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణాన్ని మ‌రింత అందంగా చూపించారు. ఎడిటింగ్ లోపాలున్నాయి. అన‌వ‌స‌ర స‌న్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని ట్రిమ్ చేసి ఉంటే..క్రిస్పీగా ఉండేది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

చివ‌రిగా: ప్రేక్షకులకు తోలిపరిచయం ఒక తీపి గుర్తు అయ్యితీరుతుంది.

రేటింగ్: ౩/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *