శ్రీదేవికి టాలీవడ్ అంటే ఇంత చిన్న చూపా..?

అవకాశం ఇచ్చిన పరిశ్రమను, అన్నం పెట్టిన ఊరును మరచిపోకూడదంటారు… చాలా మంచి ఈ విధానాన్ని పాటిస్తూ మెట్టినిల్లుగా భావిస్తుంటారు.. కానీ అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి ఇవన్నీ మరచి నట్టుందని అనుకుంటున్నారు టాలీవుడ్ లోని కొంతమంది నిర్మాతలు.. ఈ అందాల సుందరికి టాలీవడ్ అంటే ఇంత చిన్న చూపేంటని భావిస్తున్నారట. అతిలోక సుందరి అన్న గుర్తింపు కూడా శ్రీదేవికి టాలీవుడ్‌ ద్వారానే వచ్చింది. ఇక్కడ స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అనుభవించి, ఆ తరువాత బాలీవుడ్‌కి వెళ్ళింది.

తనను అంతగా అక్కున చేర్చుకున్న టాలీవుడ్‌ అంటే ఎంత ప్రేమ ఉండాలి? కానీ శ్రీదేవికి అలాంటివి ఏవీ ఉన్నట్టు కనపడదు. ఎందుకంటారా….ఆమె పెద్ద కూతురు జాహ్నవి కపూర్‌ను టాలీవుడ్‌కి తీసుకురావడానికి పలువురు దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. ప్రస్తుతం జాహ్నవి బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తోంది. తన కూతురును దక్షిణాదికి పరిచయం చేయడానికి శ్రీదేవి కోలీవుడ్‌ని ఎంచుకుందట! ఇంతగా బతిమాలుతున్న టాలీవుడ్‌ని వదిలేసి కూతురి కోసం పలువురు కోలీవుడ్‌ దర్శకనిర్మాతలతో మంతనాలు జరుపుతోందట!

ఈ విషయం తెలిసిన టాలీవుడ్‌లో కొందరు శ్రీదేవి మీద మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న ‘బాహుబలి’లో అవకాశం వస్తే తలపొగరుతో ఆ అవకాశాన్ని వదులుకుంది. ఆ తరువాత కోలీవుడ్‌లో చేసిన సినిమా ఆమె కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌. అదే శ్రీదేవి ‘బాహుబలి’ చేసుంటే ఆమె స్థాయి ఎక్కడికో వెళ్ళేదనీ అంటున్నారు. గత అనుభవాన్ని గుర్తు పెట్టుకోకుండా, ఇప్పుడు కూతురి కోసం తిరిగి కోలీవుడ్‌ని ఆశ్రయించడం ఏం బాగోలేదని శ్రీదేవిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.. శ్రీదేవి తన కూతురు కోసం చాలా జాగ్రత్తలనే తీసుకుంటోందని వినికిడి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *