అక్కినేని ఫ్యామిలీ లో ఊహించని సంఘటన…షాక్ లో నాగార్జున

తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కినేని ఫ్యామిలీ లో ఒక్కసారిగా చలించిపోయింది….ఇక పూర్తి వివరాలలోకి వెళితే తెలుగు సినీ రంగంలో దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరుతొ స్థాపించిన అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గుర్తింపును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.

ఫౌండేషన్ కు సంబంధించిన ఐటీ రిటర్న్స్‌ చెల్లించనందుకుగాను సంస్థ గుర్తింపును రద్దు చేసినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు రాజ్యసభలో తెలిపారు. 2004 సంవత్సరంలో ఏర్పాటు చేసిన అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు విదేశాల నుండి పెద్ద మొత్తంలో విరాళాలు వస్తుంటాయి. ఈ విరాళాలతో ఫౌండేషన్ పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.

వీటితో పాటు అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అక్కినేని నాగేశ్వరరావు అవార్డు పేరుతో ప్రతి సంవత్సరం సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులకు ఈ అవార్డును ప్రధానం చేస్తూ ఉంటారు. దానితో పాటు ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా వారికి అందచేస్తారు.అయితే వీటికి సంబంధించిన వార్షిక ఆదాయ వివరాలను సంస్థ కేంద్ర ప్రభుత్వానికి అందచేయలేదని, అందుకే ఫౌండేషన్ గుర్తింపును రద్దు చేసినట్లు తెలుస్తుంది.

అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తో పాటు తెలంగాణకు చెందిన మరో 190, అలాగే ఏపీలోని మరో 450 సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు ప్రకటించారు.అక్కినేని నాగేశ్వరరావు వారసుడు అక్కినేని నాగార్జున కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఐటీ రిటర్న్స్‌తో పాటు వార్షిక ఆదాయ వివరాలను సమర్పించి అక్కినేని ఫౌండేషన్ ను యధావిధిగా నడిపిస్తారా లేక ఫౌండేషన్ ను మూసివేస్తారో వేచి చూడాలి.తన తండ్రి జ్ఞాపకార్ధంగా ఆయన పేరు మీద చేస్తున్న సేవలు ఆపేస్తే పరిస్థితి ఏంటి, ఆలోచనలో పడ్డారు అక్కినేని ఫ్యామిలీ…మరి ఆయన వారసుడిగా నాగార్జున ఆ సంస్థను ముందుకుతీసుకెళ్తారా లేదా అనేది వేచి చూడాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *