రూ.కోటి ఇచ్చి తన కంటే చిన్నవాడిని పెళ్లాడింది !

తన కంటే వయసులో చిన్నవాడైన యువకుడిని వివాహం చేసుకోడానికి ఓ గొప్పింటి మహిళ వరుడు తల్లిదండ్రులకు డబ్బును ఎరగావేసింది. ఆమె ప్రతిపాదనకు కుర్రాడి త‌ల్లిదండ్రులు మొదట అంగీకరించకపోయినా, రూ. కోటి ఎదురు క‌ట్నం అనేస‌రికి సరేనన్నారు. ఆమె కంటే వయసులో ఆ యువకుడు 15 ఏళ్లు చిన్న‌వాడు. మరో విశేషం ఏంటంటే ఆమెకు ఇప్పటికే వివాహమై 14 ఏళ్ల వ‌య‌సున్న కొడుకు కూడా ఉన్నాడు.

ఇరు వర్గాలూ అంగీకరించడంతో వారి వివాహం జ‌న‌వ‌రి 10న క్వాంగాయ్‌ నగరంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఒంటి నిండా విలువైన ఆభరణాలు ధ‌రించిన ఈ జంట, స్పోర్ట్స్ కారులో ఊరేగుతూ అభివాదం చేశారు. పెళ్లి కూతురు ఆనందంతో మురిసిపోయింది. అంతేకాదు మేము ఒకొరినొకరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని ఆమె వ్యాఖ్యానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *