వ‌ర్మ జీఎస్టీ ఏ దేశంలో ఎంతో తెలుసా?

ప్ర‌పంచంలో ఏదీ ఉచితం కాదన్న మాట‌ను కొంద‌రు చెబుతుంటారు. కానీ.. అది త‌ప్ప‌న్న విష‌యం దేశంలోని కొన్ని అంశాల్ని చూస్తే క‌నిపిస్తుంటుంది. మిగిలిన వారి సంగ‌తేమో కానీ.. వ‌ర్మ మాత్రం తాను తీసిన జీఎస్టీ (గాడ్ సెక్స్ ట్రూత్‌) ఆన్ లైన్ బూతు సినిమాను చూడాలంటే త‌ప్ప‌నిస‌రిగా డ‌బ్బులు చెల్లించాల‌న్న విష‌యాన్ని తేల్చేశారు.

గ‌డిచిన కొద్ది రోజులుగా వ‌ర్మ తీసిన జీఎస్టీఅనే పెద్ద‌ల చిత్రంపై సాగుతున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. కానీ.. నిన్న రాత్రి ఒక ట్వీట్ పెట్టిన వ‌ర్మ‌.. జీఎస్టీనిఆన్ లైన్ లో చూడాలంటే త‌ప్ప‌నిస‌రిగా డ‌బ్బులు చెల్లించాల్సిందేన‌ని.. ఉచితంగా చూపించే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చేశాడు.

డిజిట‌ల్ మీడియంలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న ఈ మూవీ టికెట్ చెల్లించి మాత్ర‌మే చూడాల్సి ఉంటుంద‌న్న విష‌యాన్ని చెప్పిన వ‌ర్మ‌.. కొద్దిసేప‌టి క్రితం (ఉద‌యం ఎన్నిమిదిన్న‌ర‌.. తొమ్మిది గంట‌ల మ‌ధ్య‌లో ) ఏ దేశంలో ఎంత చెల్లించాల్సి ఉంటుంద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించాడు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఒకే ధ‌ర కాకుండా.. ఏ దేశంలో ఎంత క‌రెన్సీలో డ‌బ్బు చెల్లించాలో వెల్ల‌డించాడు. వ‌ర్మ తీసిన జీఎస్టీని ప్రొడ్యూస్ చేసిన యూఎస్ ప్రొడ‌క్ష‌న్ ధ‌ర‌ల్ని నిర్ణ‌యించిన‌ట్లుగా వ‌ర్మ చెప్పాడు. ఎందుకిలా అంటే.. ఏ దేశ‌పు స‌బ్ స్క్రిప్ష‌న్ ప్ర‌కారంగా ఆ దేశానికి టారిఫ్ మారుతుంద‌ని చెప్పిన ఆర్జీవీ.. రానున్న రోజుల్లో తాను విడుద‌ల చేసే డిజిట‌ల్ వెబ్ సిరీస్‌.. షార్ట్ ఫిలింస్‌కు ఇదే రీతిలో ఛార్జ్ చేస్తాన‌ని చెబుతున్నారు. మొత్తానికి వెబ్ వేదిక‌గా చేసుకొని త‌న సంచ‌ల‌న సినిమాల్ని ఎలా సొమ్ము చేసుకోవాలో వ‌ర్మ కొత్త పాఠాల్ని నేర్పిస్తున్నాడ‌ని చెప్పాలి.

ఇక‌.. వ‌ర్మ పెద్ద‌ల సినిమాను చూడాలంటే ఏ దేశం ప్రేక్ష‌కులు ఎంత చెల్లించాలన్న‌ది చూస్తే..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *