మరో బాంబు పేల్చిన జియో..!

జియో.. టెలీకాం రంగంలోకి రాక ముందు ఒకలా.. వచ్చాక ఒకలా తయారైంది. ఎందుకంటే కనీవినీ ఎరుగని రీతిలో ఆఫర్లను ప్రవేశపెట్టి అందరినీ ఆకర్షించేసింది. జియో కు పోటీ ఇవ్వడానికి చాలా టెలికాం కంపెనీలు పలు ఆఫర్లను ప్రకటిస్తున్నా.. జియో మాత్రం వాటిని తలదన్నుతూ ఎదుగుతూ వెళుతోంది. తాజాగా మరో ఆఫర్ ను తమ వినియోగదారులకు అందించి బాంబు పేల్చింది జియో. అదేమిటంటే.. పాత ధరకే ఏకంగా 50శాతం అధిక డేటాను అందిస్తోంది. రూ.199, రూ.399, రూ.459, రూ.499 ప్లాన్‌లపై రూ.60లు తగ్గించింది. దీంతో పాటు నూతన సంవత్సరం ఆఫర్‌ కింద రూ.198, రూ.398 రూ.448, రూ.498 ప్లాన్లపై అదనంగా 50 శాతం డేటాను అందిస్తోంది.

గతంలో ఏ ధరకైతే రోజుకు ఒక జీబీ ఆఫర్ ను ఇచ్చిందో.. అదే ధరకు ఇప్పుడు 1.5జీబీ ఆఫర్ ఇస్తోంది. అలాగే ఒక జీబీ డేటా పొందుతున్న ప్యాక్ లపై ఏకంగా 50 రూపాయలు తగ్గించి మిగతా కంపెనీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. జియోకు దగ్గరగా పలు కంపెనీలు ఆఫర్లను ప్రకటించాయి. కానీ జియో మరీ చవగ్గా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యేలా చేసింది. అంతా జియో మాయ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *