అఖిల్ కోసం ఈ సారి రంగం లోకి దిగుతున్న రానా

అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ కోసం ఇండస్ట్రీ లోని స్టార్ హీరోలంతా తెగ కష్టపడుతున్నారు.. ఎందుకు అంటారా… ఇది చదివాక మీకే అర్థం అవుతుంది చదవండి… అఖిల్ మొట్టమొదట గా హీరో అవుతున్నాడంటే నాగార్జునకు టెన్షన్ మామూలుగా లేదు.. ఎలాంటి సినిమా చేయాలి.. ఏ దర్శకుడి చేతిలో పెట్టాలి ఏ రేంజ్ లో ప్రమోషన్ చేయాలనే తపన చాలా ఉండేది నాగ్ కు.. అందుకే అఖిల్ చిత్రాన్ని నిర్మించే బాధ్యత దర్శకుడు వినాయక్ ఇచ్చి నిర్మాత గా నితిన్ ను సెలెక్ట్ చేసాడు..
ప్రొమోషన్ ను మహేష్ బాబు లాంటి వారిచే చేయించి అఖిల్ సినిమాకు హైప్ ను తెచ్చాడు.. ఇంతా కష్టపడ్డా సినిమా ఫలితం మాత్రం ఆశించినట్లు రాలేదు దాంతో రెండవ చిత్రం గా హలో ను డైరెక్టర్ విక్రమ్ చేతిలో పెట్టి నిర్మాణ బాధ్యతలను నాగ్ సొంతంగాభరించారు. ఈ చిత్రం మంచి విజయమే పొందింది… ఇప్పుడు అసలు టెన్షన్ మొదలైంది నాగ్ కు.. హలో చిత్రంతో నిర్మాత గా విపరీతమైన టెన్షన్ కు గురయ్యాను. ఇక వద్దు అనుకోని మూడో సినిమాను బిగ్ స్టార్ బాహుబలి బల్లాలా దేవుడికి అప్పగించాడని టాక్..
ఇక దర్శకుని విషయానికి వస్తే  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ర‌విరాజా పినిశెట్టి కుమారుడు స‌త్య పినిశెట్టి ఇటీవ‌ల అఖిల్ కు ఒక క‌థ వినిపించాడ‌ట‌. క‌థ‌లో కొత్త‌ద‌నం ఉండ‌టంతో మ‌రో మాట లేకుండా అఖిల్ అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం..త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. స‌త్య పినిశెట్టి గ‌తంలో మ‌లుపు మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.. విశేష‌మేమిటంటే ఈ మూవీకి రానా దగ్గుబాటి నిర్మాత గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు అని విపరీతంగా ప్రచారం జరుగుతోంది.. ఒక వేళ ఇది నిజమైతే అఖిల్ ను ఇండస్ట్రీలో నిలబెటెందుకు పెద్ద హీరోలంతా తెగ కృషి చేస్తున్నారని అర్థమవుతోంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *