రజని కాంత్ 2.0 అప్పుడే బాహుబలి-2 ని దాటేసింది

బాహుబలి-2 సెట్ చేసిన రికార్డులను చెరిపేస్తుంది.. అంచనాలు కలిగిన సినిమా ‘2.0’. రజనీకాంత్ -శంకర్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘రోబో’కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోందని వేరే చెప్పనక్కర్లేదు. ఈ సినిమాపై అంచనాలు కూడా అందుకు తగట్టుగానే ఉన్నాయి. అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ఈ సినిమా బారీ నంబర్లను పలుకుతోందని సమాచారం.

ఇలా ఈ సినిమా ‘బాహుబలి-2’ రికార్డ్స్ కు ఎర్త్ పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా రోబో-2 మలయాళ డిస్ట్రిబ్యూషన్ హక్కులకు సంబంధించి ఈ మాట వినిపిస్తోంది. ఈ సినిమా మలయాళం డబ్బింగ్ హక్కులను ఏకంగా పదహారు కోట్ల రూపాయలకు అమ్మారని సమాచారం. తెలుగు, తమిళ భాషలతో పోలిస్తే చిన్నది అయిన మలయాళీ మార్కెట్ లో ఒక అనువాద సినిమా ఈ రేంజ్ లో అమ్ముడు పోవడం ఇదే తొలి సారి.

ఇంతకు ముందు ఈ రికార్డు బాహుబలి-2 పేరు మీద ఉండేది. బాహుబలి సూపర్ హిట్ అనంతరం బాహుబలి-2 సినిమా విడుదల హక్కులు కేరళలో పదిన్నర కోట్ల రూపాయలు పలికాయి. ఆ రికార్డును అధిగమిస్తూ 2.0 సినిమా పదహారు కోట్ల రూపాయల ధర పలికింది. తద్వారా బాహుబలి-2 సెట్ చేసిన ఒక రికార్డును రజనీకాంత్-శంకర్ ల సినిమా అధిగమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *