ప్రేమిక సినిమా రివ్యూ

దేవరాజ్   అనే ఒక పెద్ద మనిషి ఊరిని  తన గుప్పిటలో పెట్టుకొని.. చాల సంవత్సరాలుగా పెత్తనం చేస్తూ తన రాజకీయ బలంతో… రౌడి బలంతో….. అందరినీ దోచుకుంటూ ఉంటాడు. అదే ఊరిలో ఉన్న కృష్ణ (తనీష్) తన స్నేహితులతో ఆడుతూ… పాడుతూ… తిరుగుతూ  ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే ఊరిలో ఉన్న హీరోయిన్  తులసి  (శ్రుతి యుగళ్) అనే అమ్మాయీ తో ప్రేమలో పడతాడు. తులసి వాళ్ళ నాన్న తులసి, కృష్ణ ల ప్రేమ తెలిసి కృష్ణ కి ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ వాళ్ళ కృష్ణ ఆ ఉరి పెద్ద మనిషి దేవరాజ్ కి ఎదురు తిరగవలసిన పరిస్థితి వస్తుంది… ఆ తరువాత కృష్ణ జీవితం లో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి.. ఆ సమస్యలని ఎలా ఎదుర్కొన్నాడు.. చివరకి తన ప్రేమని గెలిచాడా ? లేదా ? అనేది ఈ చిత్ర కథ .. !

తనీష్ : కృష్ణ పాత్రలో తనీష్ తనకు ఇదివరకు ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ ని మరిపిస్తూ తను మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తూ, తన అద్భుతమైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు.

శ్రుతి యుగళ్ : తులసి పాత్రలో నటించిన (శ్రుతి యుగళ్) తన పాత్రకు సరైన న్యాయం చేసింది.

ఇతర నటీనటులు : తొలిసారి పూర్తి స్థాయీ ప్రతి నాయకుడి (పాత్ర) పోషించిన రవి వర్మ తను పెద్ద స్తాయి పాత్రలో నటించగలను అని నిరూపించుకున్నాడు. గెటప్ శ్రీను, జబర్దస్త్ మహేష్, బ్యాంకు సురేష్ స్నేహితులుగా నటించి వినోదాన్ని పంచారు. సూర్య, కవిత, కోటేశ్వర రావు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం : డైరెక్టర్ మహేంద్ర తన మొదటి సినిమానే అయినప్పటికీ తాను ఎంచుకున్న యథా కథలోని ఎమోషన్స్ ని ఎక్కడా డ్రాప్ అవ్వకుండా సినిమాలోని కమర్షియల్ అంశాలను మిస్ అవ్వకుండా సహజత్వం కనిపించేలా జాగ్రత్త పడ్డాడు. తను రాసిన మాటలు సినిమాకి ప్రధాన బలం. అలాగే మిగతా సాంకేతిక వర్గం నుంచి అద్భుతమైన ప్రతిభను రాబట్టుకున్నాడు. దిలీప్ బండారి అందించిన బాణీలు సినిమాకి మరో ప్రధాన బలంగా నిలిచాయి. రాములో రాములో పాట మాస్ ప్రేక్షకులని ఉర్రుతలుగించింది. నేపద్త్య సంగీతం కథకు ప్రాణం పోసింది. రాహుల్ మాచినేని సినేమతోగ్రఫి చాల బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ సినిమా స్థాయిని పెంచింది. నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఎక్కడ చిన్న సినిమా అని అనిపించా లేదు.

ప్లస్ పాయింట్స్ :

తనీష్, రవి వర్మల నటన

స్క్రీన్ ప్లే , డైలాగ్స్, దర్శకత్వం.

పాటలు, నేపధ్య సంగీతం.

మైనస్ పాయింట్స్ :

పెద్ద పెద్ద  నటులు లేకపోవడం ఇది కూడా పెద్ద మైనస్ ఏమి కాదు

హీరోయిన్ మన తెలుగు సంప్రదాయానికి సారిగా సెట్ అవ్వలేదేమో అనిపిస్తుంది

కొన్ని లొకేషన్లను ఇంకా బాగా చూపించే ప్రయత్నం చేయాల్సింది.

రేటింగ్ : 3 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *