అగ్నతవాసి -రివ్యూ & రేటింగ్

నటీనటులు:  పవన్ కళ్యాణ్, అను  ఇమ్మానుయేల్, కీర్తి  సురేష్,  కుష్బూ, బొమ‌న్ ఇరానీ…, నిర్మాత: రాధాకృష్ణ  , ర‌చ‌న – దర్శకత్వం: త్రివిక్రమ్ , సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ,  ర‌న్ టైం: 158 నిమిషాలు.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కంబో అంటే మంచి పేరు ఉంది. ఈ సినిమాతో ఇక పొర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలి అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఈ సినిమా పవన్ కు కెరీర్ కు  ఎంతమేర ఉపయోగపడుతుందో రివ్యూ లో చూసేద్దాం.

స్వతహాగా ఏబీ ఫార్మా అనే ఫార్మా కంపెనీ ఓన‌ర్ విందా (బొమ‌న్ ఇరానీ), ఇంద్రాణి (ఖుష్బూ) భార్య భ‌ర్త‌లు. ఈ ఫార్మా కంపెనీ కి ఓనర్ అవ్వాలి అన్నన దురుద్దేశం తో  విందా తో పాటు అతడి కొడుకును చంపేస్తాడు ఆది పిన్నిసేట్టి. విందా భార్య కోరిక ప్రకారం తనికెల్ల భరణి వలన  బాల సుబ్ర‌హ్మ‌ణ్యం ఏబీ ఫార్మా లో ఉద్యోగిగా ఎంట్రీ ఇస్తాడు. విందా హ‌త్య చేసిన వాళ్లను క‌నుగొనేందుకు క్లూస్ కోసం వెదికే క్ర‌మంలో ఇంద్రాణిని చంపేందుకు ఆమెపై ఎవ‌రో చేసిన ఎటాక్ ను బాల సుబ్ర‌హ్మ‌ణ్యం అడ్డుకుంటాడు. అసలు విందా భార్య ఇంద్రాణి మీద ఎటాక్ ఎవరు చేసారు ఎందుకు చేసారు అన్నది కథ. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, అభిషిక్త భార్గ‌వ‌ల కు సూర్య‌కాంతం ( అను ఎమ్మాన్యుయేల్‌), సుకుమారి (కీర్తి సురేష్‌) ఏమవుతారు ? అసలు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు ? అసలు విందా వ్యాపార వారసత్వం ఎవరికీ ఇవ్వాలి అనుకున్నాడు ? అసలు పవన్ కళ్యాణ్ ఎవరు అన్నదే ఈ సినిమా.

పెర్ఫార్మన్స్: ఈ సినిమాలో పవన్ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం, అభిషిక్త భార్గ‌వగా మంచి నటనను చూపించాడు. ఎప్పటిలాగానే పవన్ తనదైన మానరిజం తో దుమ్ము లేపాడు. కీర్తి సురేష్ సంప్ర‌దాయ‌మైన అమ్మాయిగాను, అను ఎమ్మాన్యుయేల్ మోడ్ర‌న్ దుస్తుల్లో అందాలను ఆరబోసారు. ఆది పిన్ని శెట్టి విలన్ గా చాలా బాగా చేసాడు. పవన్ కు సరైన విలన్ లా నిలిచాడు. ఇక కుష్బు గురించి చెప్పుకోవాలి..పవన్ కళ్యాణ్ కుష్బు మధ్య సీన్ లు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. కమెడియన్ లు అందరు తమ తమ స్థాయికి తగ్గట్లు కామెడి ని బాగానే పండించారు.

విశ్లేషణ: ఈ సినిమా స్టొరీ లైన్ పాతదే అయ్యినప్పటికి ఈ ట్రెండ్ కి తగ్గట్లు ఎన్నో మలుపులను జోడించి పవన్ లాంటి పవర్ ఫుల్ హీరో అలానే ఇద్దరు ముద్దుగుమ్మలను పెట్టి త్రివిక్రమ్ సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. సినిమా ఎక్కడ బొర్ కొట్టకుండా అలా సాగిపోతు ఉంటుంది.తండ్రిని హత్య చేసిన వారిపై పగ తీర్చుకునే కథే ఈ సినిమా కానీ అంత సింపుల్ గా చెప్పడానికి లేదు సినిమా చూడాల్సిందే.

ప్లస్ (+): ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. పవన్ కాకుండా వేరే వాళ్ళు అయితే అసలు ఈ సినిమాను ఊహించుకోలేము. ఇంటర్వెల్ బాంగ్ ఆడియన్స్ ని పిచ్చేక్కిస్తుంది. హీరోయిన్ లు ఇద్దరు నటనతో బాగా మెప్పించారు. కామెడీ కూడా బాగా పండింది. పాటలు మరియు బాక్గ్రౌండ్ స్కోర్ ఆదరగోట్టాయి .ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ కుష్బు మధ్య సీన్స్ చాలా బాగున్నాయి.

 

మైనస్: కథ కొంచం సాఫీగా నడిచినట్లు అక్కడక్కడ అనిపిస్తుంది. హీరోయిన్ లు మాటి మాటికి హీరోను హాగ్ చేసుకోవడం.

TollyBee రేటింగ్: 2.75

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *