రివ్యూ: ఒక్కక్షణం

అల్లు శిరీష్  ఆసక్తికరమైన ప్రయత్నం, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన వి ఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు , సురభి హీరోయిన్ గా  తెరకు ఎక్కించిన చిత్రమే ఒక్క క్షణం అసలు ఈ సినిమా ఏంటో ఎలా ఉందొ ఒక లుక్ వేసి వద్దాం రండి !

ట్రైలర్ లో ఉన్నట్లే ఇది రెండు జంటల సమాంతర జీవితాల మధ్య జరిగే కథ. ఒకరి జీవితంలో జరుగుతున్న ఘటనలే మరొకరి జీవితంలో కూడా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జంటలు ఎలాంటి ఇబ్బందులని ఎదుర్కొనవలసి వచ్చిందనేది చిత్రంలోని ఇంటరెస్టింగ్ ఎలిమెంట్. ఫస్ట్ హాఫ్ వరకు కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగానే సాగింది. కానీ నేరేషన్ లో కాస్త బలంతగ్గినట్లు అనిపించింది. ఇంటర్వెల్ సన్నివేశంలో భారీ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచేశారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా తరహాలోనే వి ఐ ఆనంద్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తాయి.

ట్రైలర్ లో ఆసక్తిని పెంచిన విధంగానే శ్రీనివాస్ అవసరాల పాత్ర ఈ చిత్రంలో చాలా కీలకమైనది. హీరో , హీరోయిన్ లు తమ నటనతో 100% న్యాయం చేశారు. అవసరం పాత్ర అద్బుతంగా చేసారు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే తాను అనుకున్న, రాసుకున్న కథను ఏ మాత్రం పక్క దోవ పట్టకుండా పట్టాలు ఎక్కించాడు అనడం లో అతిశయోక్తి లేదు. అసలు ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తు ఉంటాయి. వచ్చిన వాటిలో సక్సెస్ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాని ఒక్క క్షణం మాత్రం వాటికీ అతీతంగా విజయాన్ని సాధించింది అని చెప్పొచ్చు.

ఇక నటీనటుల విషయానికొస్తే అల్లు శిరీష్‌, సురభి , శ్రీనివాస్‌ అవసరాల, శీరత్‌ కపూర్ల నటన బాగుంది. హీరోయిన్ల గ్లామర్‌ సినిమాకి కలిసొచ్చింది. మణిశర్మ పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకి మరో ప్లస్‌ పాయింట్‌. దర్శకుడు వి ఆనంద్‌ మరోసారి మంచి ఫిక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాని చూపించాడు.

 

ప్లస్: స్టొరీ కొత్తగా ఉండి ఎక్కడా బోర్ లేదు

ఇంటర్వెల్ బాంగ్,

డైరెక్టన్ ఈ సినిమాకి ప్లస్

హీరో, హీరోయిన్ ల నటన

 

మైనస్: ఫస్ట్ హాఫ్ లో స్టొరీ కి కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది.

స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగినట్లు అనిపించడం

 

TollyBee.com Rating: 3.25/5

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *