రివ్యూ: మిడిల్ క్లాసు అబ్బాయి – మిడిల్ లోనే ఆగిపోయిందా ?

పిల్ల జమిందార్ లో నాని ని రిచ్ గా చుసిన ప్రేక్షకులు మిడిల్ క్లాసు పాత్రలో ఒప్పుకున్నారా ? అసలు ఈ మిడిల్ క్లాస్ సినిమాలో నాని ఎన్నెన్ని కష్టాలు పడ్డాడు అనేది రివ్యూ లో చూద్దాం.

సినిమాలో నాని తన నటనతో ఎప్పటిలాగానే మెప్పించాడు. భూమిక, రాజీవ్ కనగాల, నాని సన్నివేశాలు మంచి ఎంటర్టైన్మెంట్ తో పటు ఎమోషన్ ని కూడా చూపిస్తాయి. ఆర్ టి ఓ లో పనిచేస్తున్న  భూమిక కు వరంగల్ ట్రాన్స్ఫర్ అవ్వడం తో అన్న రాజీవ్ కనగాల కోరిక మేరకు భూమికతో వరంగల్ వెళ్ళిన నాని కి అక్కడ కాలేజీ లో చదువుతున్న హీరోయిన్ సాయి పల్లవి పరిచయం అవుతుంది. శివ (విజయ్) అక్కడ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ లు చేసే వ్యక్తి అతనే ఈ సినిమాకి విలన్. అతను ఎంటర్ అవ్వడం తోనే కథ మొదలు అవుతుంది అప్పటి వరకు  పాత్రను పరిచయం చేయడం తోనే సరిపోతుంది.

సినిమాలో కథ అనేది పెద్దగా లేకపోయినా నాని సాయి పల్లవి ఇంకా భూమిక రాజీవ్ కనగాల లలో నడిచిపోతుంది. ఫస్ట్ హాఫ్ కొంచం పర్లేదు అనిపించినా సెకండ్ హాఫ్ అంతగా లేకపోవడం కాస్త మైనస్ అనే చెప్పాలి. దిల్ రాజు నిర్మాణ శైలి ఈ సినిమాలో కాస్త తగ్గింది అనుకోవచ్చు. పాటలు మరికొన్ని సాంకేతిక వేల్యూ లు ఈ సినిమాలో ఎక్కువ మార్కులు సదిన్చాలేకపోయాయి.

ప్లస్:

నాని డైలాగ్ డెలివరీ, నటన కట్టి పడేస్తాయి

కామెడీ క్లియర్ గా అందరికి అర్ధం అయ్యేలా ఉంది

సాయి పల్లవి పాత్ర అంతగా ఏమి లేదనే చెప్పాలి

వదిన మరిదిగా భూమిక నాని కి 100 మార్కులు వేయొచ్చు

మైనస్: 

పాటలు, సెకండ్ హాఫ్,

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దేవి శ్రీ ఇచ్చినట్లు అస్సలు లేదు

ప్రొడక్షన్ వాల్యూస్ మిస్ అయ్యాయి అనే చెప్పాలి.

చివరిగా: అన్ని నాని సినిమాల్లా కాక ఇది కొంచం మిడిల్ క్లాసు గానే ఉంది అని చెప్పాలి.

 

Tollybee.com రేటింగ్: 2.5/5

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *