మంచు విష్ణు కి ఆ పాత్ర బాగా కలిసి వచ్చిందట

సినీ ఇండస్ట్రీ లో మంచు కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది.. వీరు కేవలం సినిమాల వల్లే కాదు బిజినెస్ రంగంలో కూడా మంచి పేరునే సంపాదించారు ఈ మంచు వారు. గత కొంతకాలంగా ఈ మంచు ఫ్యామిలీ కు సినిమాలు కలసి రావడం లేదు అనడంలో సందేహం లేదు… ఎందుకంటె ఇటీవల విడుదలైన సినిమాలే ఇందుకు నిదర్శనం గా చెప్పొచ్చు. మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్ ఇలా ఎవరు ఏ జోనర్ చేసినా సినిమాలు హిట్ అవ్వడం లేదు.

ఓ రకంగా చెప్పాలంటే మంచు మోహన్ బాబు నే వీరి ముగ్గురికంటే ముందంజ లో ఉన్నారు వారసత్వం మొదలు అయింది అతనితోనే.. కొనసాగుతుంది కూడా అతనితోనే.. మోహన్ బాబు కు ఉన్నంత ఫాల్లోవింగ్ కానీ.. ఈయన సినిమాలకు అయ్యే బిజినెస్ కానీ మిగతా ముగ్గురి విషయం లో జరగలేదు.. ఇక అసలు విషయానికి వస్తే వీరిలో మోహన్ బాబు తరువాత ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మాత్రం మంచు విష్ణు. ఈయన తొలి ఫిల్మ్ యావరేజ్ స్థాయిలో నిలించింది ఆ తరువాత వచ్చిన సినిమాల్లో ఒకటో రెండో విజయాలు సాధించాయి.. ఇందులో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన డీ సినిమా భారీ విజయాన్ని సాధించింది.

అనంతరం కొంత గ్యాప్ తరువాత వచ్చిన దేనికైనా రెడీ చిత్రం సక్సెస్ సాధించింది. ఈ చిత్రం లో బ్రాహ్మణ పాత్రలో ఇరగదీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. ఈ సినిమా దగ్గరనుంచి మరో హిట్ విష్ణు దారికి చేరలేదు.. దాంతో మరీ ఇప్పుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రిపీట్ కాంబినేషన్ తో ఆచారి అమెరికా యాత్ర తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం లో కూడా మంచు విష్ణు బ్రాహ్మణ పాత్ర లో కనిపించనున్నారు. దేనికైనా రెడీ లో బ్రాహ్మణ పాత్రలో కామెడీ ని బాగా పండించి అందరి మన్ననలను పొందారు. అందుకే మళ్ళీ ఇదే పాత్రలో నటిస్తున్నాడు.. సో ఇప్పుడైనా ఈ చిత్రమైనా మంచు విష్ణు కు కలసి వస్తుందని అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *