కత్తి మహేష్ పారి పోయాడు.. అలా చేసింది ఎవరో తెలుసా ?

గత కొన్ని నెలలు గా ఏక కంఠం తో పవన్ కళ్యాణ్ వచ్చి తనకు సమాధానం చెప్పాలంటూ పవన్ జపం చేస్తున్న క్రిటిక్ కత్తి మహేష్ ఎట్టకేలకు ఓ ఛానల్ లైవ్ షో నుంచి పారిపోయాడు. అదే లైవ్ లో తన ఎదురు కూర్చున్న ఓ వ్యక్తి అడిగిన ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక… ‘దిస్ ఈజ్ నాట్ కరెక్ట్’ అంటూ తుర్రు మన్నాడు. ఇంతకీ కత్తికే చమట్లు పట్టించిన ఆ వ్యక్తి ఎవరు? అతను అడిగిన ప్రశ్నేంటి? అనే వివరాల్లోకెళ్తే… నాగచైతన్య హీరోగా రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ‘బెజవాడ’ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది కదా.

ఆ సినిమా దర్శకుడు వివేక్ కృష్ణ. సింపుల్ గా ఒకేఒక ప్రశ్నతో కత్తి మహేశ్ కి చెమట్లు పట్టించేలా చేసాడు. నటి పూనమ్ కౌర్ పూనమ్ చేసిన ట్వీట్ కు చీప్ ట్రిప్స్ ప్లే చేస్తూ కత్తి మహేశ్ ఆదివారం ఆరు ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. అయితే… కత్తి మహేశ్ మహిళను టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించడం పలు విమర్శలకు దారి తీసింది. ఇందులో భాగంగానే దర్శక, రచయిత వివేక్ కృష్ణ లైవ్ షోకి రావడం జరిగింది. ఎప్పటిలాగే కత్తి మహేశ్ ఓ ప్రముఖ ఛానల్ లైవ్ షోకి హాజరయ్యాడు. అయితే ఆ చానల్ వారితో ముందే మాట్లాడుకొని వివేక్ కృష్ణ కూడా అదే లైవ్ షోకి వచ్చాడు. కత్తి మహేశ్, వివేక్ కృష్ణ ఎదురెదురుగా కూర్చున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ మీడియా ముఖంగా ఓ మహిళను ప్రశ్నించాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ముందు కత్తి మహేశ్ లైవ్ షోలో వివరించాడు.

ఆ తర్వాత కత్తి మహేశ్ పై వివేక్ కృష్ణ ఓ ప్రశ్న సంధించాడు. అనుకోకుండా నీ మీద అభిమానులు దాడి చేస్తే ఏం చేస్తావ్? అనే వివేక్ ప్రశ్నకు ‘పోలీస్ లను ఆశ్రయిస్తా, చట్ట పరమైన చర్యలు తీసుకుంటా.’ అని జవాబిచ్చాడు కత్తి. నెక్స్ట్ వివేక్ అడిగిన ప్రశ్న… ‘మీ అమ్మ గారి గురించి వినాలని ఉంది. చెబుతారా? ‘ ఈ ప్రశ్నేకే కత్తి ఘతుక్కుమన్నాడు. సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. దానికి వివేక్.. మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడిగాడు. ‘ఏం.. మీ అమ్మ గురించి చెప్పలేవా? చెప్పలేనంత దరిద్రం ఏమైనా ఉందా? అని రెట్టించి అడగడంతో.. కత్తి మహేశ్.. లైవ్ షో నుంచి సీరియస్ గా లేచి వెళ్లి పోయాడు. ఈ లైవ్ షోలో జరిగిన ఈ ఊహించని సంఘటన చూసే వీక్షకుల్ని కూడా విస్మయానికి లోను చేసింది. మరి దీనిపై కత్తి మహేశ్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *