ఛార్మి పై వర్మ కామెంట్స్ కి మండిపడ్డ లక్ష్మి పార్వతి

ఇటీవల చాలా కాలమే అయ్యింది రామ్ గోపాల్ వర్మ వివాదాలను లేవనెత్తక… అయినా సరే ఎప్పుడో ఎక్కడో ఏదో సందర్భాల్లో అన్న మాటలను మాత్రం ఎవరు మరచి పోరు అవకాశం వచ్చినప్పుడంతా గుర్తుతెచ్చుకొని వాడేసుకుంటూ… వర్మ ను ఆడేసుకుంటుంటారు… సరిగ్గా ఇదే అదునును చూసుకొని సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మను లక్ష్మీ పార్వతి వివాదాలు సృష్టించే నారదుడితో పోల్చారు. వర్మ అంటేనే వివాదగ్రస్తుడని, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వ్యక్తి సినిమా తీస్తే వివాదాలు రాకుండా మరేం ఉంటాయని ప్రశ్నించారు.
ఓ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె..నారదుడే బహుశా వర్మ రూపంలో పుట్టి ఉండవచ్చునని వ్యంగ్యంగా అన్నారు. దెయ్యాల సినిమాలు తీసి జనాలను భయపెట్టే వర్మ..సమాజానికి మెసేజ్ ఇచ్చేలా ఒక్క సినిమా కూడా తీయలేదని విమర్శించారు. డ్రగ్స్ కేసులో విచారణకు ఛార్మీ ని పిలిస్తే ఆమెను ఝాన్సీ లక్ష్మి బాయితో పోల్చడం ఏమిటని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన దారి తప్పిన మేధావి అని అర్థమవుతోందని, తన తెలివిని వర్మ మంచికి వినియోగిస్తే బాగుంటుందని పేర్కొన్నారు.
ఇక ఎన్టీఆర్ పై హీరో బాలకృష్ణ తీయనున్న బయో పిక్ గురించి ప్రస్తావిస్తూ, బాలయ్య ప్రయత్నాన్ని అభిననందిస్తున్నా అన్నారు. ఎన్టీఆర్ జీవితం మొత్తాన్ని సినిమాగా చూపాలని నేనేమీ కోరుకోవడంలేదు అని లక్ష్మీ పార్వతి అన్నారు. ఇదలా ఉంచితే ఒకే బయో పిక్ ను ఇద్దరు సినిమా గా మలుస్తున్నారన్న సంగతి తెలిసిందే.. వారిలో ఒకరు దర్శకుడు తేజ కాగా మరొకరు వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్న రామ్ గోపాల్ వర్మ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *