మళ్లీ సిక్స్‌ ప్యాక్‌తో ఎన్టీఆర్‌ !

ఎన్టీఆర్‌ మొదటిసారి ఆన్‌ స్క్రీన్‌ చొక్కా విప్పింది ఎప్పుడు? ‘టెంపర్‌’లో. ఆరు పలకల దేహంతో ఆ సినిమాలో కనిపించి, ఆకట్టుకున్నారు. మళ్లీ ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో కనిపించనున్నారు. దీనికోసం కసరత్తులు చేస్తున్నారు. మరి.. ఈసారీ చొక్కా విప్పుతారా? అంటే సమాధానం తెలియడానికి చాన్నాళ్లు పడుతుంది. ఇంతకీ ఏ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ అంటే.. త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో చేయబోతున్న మూవీకే. ఇందులో ఎన్టీఆర్‌ స్లిమ్‌ లుక్‌లో కనిపించనున్నారన్న సంగతి తెలిసిందే.

దాని కోసం ట్రైనర్‌ ‘స్టీవెన్‌ లాయిడ్స్‌’ పర్యవేక్షణలో ట్రైనింగ్‌ ప్రాసెస్‌లో ఉన్నారు. సిక్స్‌ ప్యాక్‌ లుక్‌ కోసం ఎన్టీఆర్‌ సుమారు 18 కిలోలు బరువు తగ్గనున్నారు. స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా ఫినిష్‌ చే సి, ప్రస్తుతం ఫైనల్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారట దర్శకుడు త్రివిక్రమ్‌. పూర్తి స్థాయి లవ్‌ స్టోరీ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌ పై రాధాకృష్ణ నిర్మించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *