మహేష్ కత్తి దగ్గర నిజంగానే పవన్ పై ఆధారాలు ఉన్నాయా ?

మహష్ కత్తి అనే వ్యక్తి బిగ్గ్ బాస్ కు ముందు చాలా తక్కువమందికి తెలుసు ఆయన వేసిన పెసరట్టు గురించి అయితే ఇంకా చాలా తక్కువ మందికి తెలుసు. మహేష్ కత్తి మొదటి నుండి పవన్ ఇంకా పవన్ కళ్యాణ్ ఫాన్స్ పై మొండి వైకరితోనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ను గెలికితే తాను పేరు సంపాదించు కోవచ్చు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ పవన్ పై కామెంట్ చేయనిది మాత్రం ఆయన నిద్రపోడు.

పూనం కౌర్ తో చేసిన సవాల్ కోసం నిన్న ప్రెస్ క్లబ్ లో 11 గంటలకు వచ్చిన మహేష్ కత్తి మాట్లాడిన మాటలు తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అనడం. ఇంతవరకు ఇండస్ట్రీ లోనే కాదు ఫాన్స్ ఎవరికీ కూడా తెలియని విషయాల గురించి అక్కడ డిస్కస్ చేయడం చూస్తుంటే పవన్ వెనుక ఏదో జరుగుతుంది అని అనక మానరు. పవన్ కళ్యాణ్ పూనం కౌర్ ఒకరికి ఒకరు తెలుసు అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ నిన్న మహేష్ కత్తి మాట్లాడిన విధానం చూస్తుంటే మహేష్ కత్తి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అనే అనిపిస్తుంది.

ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే సాక్ష్యాలు ఏమి లేనిది అన్ని చానల్స్ కు వెళ్ళి ఇంటర్వ్యూ లు ఇచ్చి గంటలు గంటలు వాదించే సాహసం ఎవరు చేయరు. ఎందుకు అంటే రేపు ఏదైనా తేడా వస్తే మొతానికి మునుగిపోయే పరిస్థితి రావొచ్చు. కాని మహేష్ కత్తి కి ఆ సాక్ష్యాలు సంపాదించడానికి ఎవరు సహాయం చేసారు. వారికీ పవన్ కళ్యాణ్ కు ఉన్న గొడవ ఏంటి అన్న అనుమానాలు వస్తున్నాయి. పూనం కౌర్ ఫ్యామిలీ త్రివిక్రమ్ మిద నేదుకు ఆగ్రహంగా ఉంది ? అసలు మహేష్ కత్తి వెనుక ఉన్న షాడో ఎవరో తెలియాలి. అన్నిటికి త్వరలోనే సమాధానం దొరికే సూచనలు కనపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *