‘హైదరాబాద్ లవ్ స్టోరీ’ రివ్యూ & రేటింగ్

రాహుల్ రవీంద్రన్, రేష్మీ మీనన్, జియా జంటగా నటించిన చిత్రం ‘హైదరాబాద్ లవ్ స్టోరీ’. అందాల రాక్షసి లాంటి క్యూట్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను అలరించిన రాహుల్ రవీంద్రన్.. మరోసారి లవర్ బోయ్ గా మన ముందుకొచ్చాడు. రండి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

కథ: కార్తీక్(రాహుల్ రవీంద్రన్) ఎల్ అండ్ టీ కంపెనీలో ఇంజినీర్ గా పనిచేస్తుంటారు. అతనికి ఓ ఇన్ ఫ్రా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భాగ్యలక్షి(రేష్మీ మీనన్) పరిచయం అవుతుంది. వీరిద్దరూ తొలిచూపులోనే ప్రేమించుకుంటారు. అలా ప్రేమించుకుంటున్న సమయంలోనే కార్తీక్ కి అమ్మాయిల కంటే.. అబ్బాయిలంటేనే బాగా ఇష్టం అని తెలుస్తుంది. దాంతో అతన్ని అనుమానించడం మొదలుపెడుతుంది. దాంతో వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. అలా దూరమైన వీళ్లిద్దరూ మళ్లీ ఒకటి ఎలా అయ్యారు? అసలు కార్తీక్ పై భాగ్యలక్ష్మికి అలా అనుమానం ఎందుకు వచ్చింది? అసలు కార్తీక్ తల్లిదండ్రులు ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: లవ్ స్టోరీలకు ఈరోజుల్లో మంచి డిమాండ్ ఉన్నది తెలిసిన సంగతే. సినిమాలో రొమాంటిక్ సీన్ లు బాగా ఆకట్టుకున్నాయి. రొటీన్ కి భిన్నంగా స్నేహానికి.. ప్రేమను మిళితం చేసి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఫీల్ గుడ్ సన్నివేశాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. మొదటి హాఫ్ అంతా ప్రేమ.. కామెడీతో నింపేసి… ద్వితీయార్థంలో మాత్రం ప్రేమకి.. స్నేహానికి మధ్య జరిగే సంఘర్షణను తెరమీద బాగా చూపించారు. దాంతో యూత్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోతారు. ఈ వారం తప్పకుండా యూత్ కి నచ్చే సినిమా హైదరాబాద్ లవ్ స్టొరీ.

రాజ్ సత్య.. స్నేహానికి, ప్రేమకి మధ్య రాసుకున్న కథ.. కథనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా వున్నాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో కథ.. కథనాలను వేగంగా నడిపి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. సునీల్ కశ్యప్ అందించిన సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా వుండాల్సింది. ఓ ఇరవై నిమిషాల పాటు కత్తెర వేయొచ్చు. అలానే సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ చాలా రిచ్ గా వున్నాయి. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేశారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
రేటింగ్: 3.25/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *