హలో మూవీ రివ్యూ & రేటింగ్

అక్కినేని కుర్రాడు అఖిల్‌ ఇప్పుడు హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. సంవత్సరం గ్యాప్‌ తర్వాత రీ లాంచ్‌ సినిమాగా ప్రచారం చేసుకున్న హలో తోనైనా అఖిల్‌ హిట్‌ కొట్టాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే ! .

అనాద అయిన శ్రీనుని రమ్యకృష్ణ-జగపతిబాబులు ఆదరిస్తారు . అవినాష్‌ గా వారి ఇంట్లో పెరిగిన  శ్రీను  చిన్నతనంలో తన మనసుకి దగ్గరైన ప్రియా కోసం 15 సంవత్సరాలుగా వెతుకుతూనే ఉంటాడు. అతి కష్టం మీద ఆమె ఎక్కడ ఉందొ  తెలుసుకునేందుకు ఒకే ఒక్క ఆధారమైన ఫోన్‌ ని పొగొట్టుకుంటాడు. ఆ ఫోన్‌ కోసం ప్రయత్నిస్తున్న టైమ్‌ లో అవినాష్‌ కి ఎలాంటి సంఘటనలు ఎదురువుతాయి ? విలన్లకు అవినాష్‌ ఎలా టార్గెట్‌ గా మారతాడు ? తన సోల్‌ మేట్‌ ని ఎందుకు దూరం చేసుకుంటాడు ? వాళ్ళని ఎలా ఎదిరించాడు అన్నదే సినిమా..ఎలా మళ్లీ ఇద్దరూ ఒక్కటవుతారు అన్నది తెలుసుకోవాలంటే వెండితెరపై చూడాల్సిందే !

సినిమాలో ప్లస్‌ పాయింట్స్‌ గురించి చెప్పుకోవాలంటే అఖిల్‌ నటన మెచ్యూర్డ్‌ గా ఉంది. అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చిన రొమాంటిక్‌ ఇమేజ్‌ అఖిల్‌కి బాగా సూటైంది. డాన్స్‌ చాలా చాలా బాగా చేశాడు. ఇక ఫైట్లైతే చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్‌ మూవీని చూసినట్లు ఉంటుంది. రిస్కీ ఫైట్లతో అఖిల్ ఇరగదీశాడు. మనం సినిమాతో అక్కినేని కుటుంబానికే కాదు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ తన స్టైల్లో ఈసినిమాని తెరకెక్కించాడు.

ఫస్టాఫ్‌ అంతా రొమాంటిక్‌,సెకాండాఫ్‌ అంతా యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా ఉంటుంది. ఇక హీరోయిన్‌ కళ్యాణి ప్రియదర్శన్‌ నటన పర్వాలేదు. గ్లామర్‌ కి దూరంగా కాస్తంత క్యూట్‌ గా కనిపించింది. జగపతిబాబు,రమ్యకృష్ణలు తమ పాత్రలకు న్యాయం చేశారు. అజయ్‌ చాలారోజుల తర్వాత మళ్లీ పర్ఫెక్ట్‌ విలన్‌ గా నటించాడు. ఇక మైనస్‌ పాయింట్స్‌ గా చెప్పుకోవాలంటే రొటీన్‌ కథ.. ఇక మ్యూజిక్‌ కూడా మనం సినిమాలోని ట్యూన్లనే విన్నట్లుంది. కొన్ని సందర్భాల్లో అనవసరమైన ఫైట్లు, సాగదీత సన్నివేశాలు మాత్రమే కనిపించాయి.

టెక్నికల్‌ పరంగా చెప్పుకుంటే అక్కినేని బ్యానర్‌ లో ఈ సినిమా తెరకెక్కడంతో అన్నింటిలోనూ రిచ్‌ క్వాలిటీ కనిపించింది. కెమరా పనితనం,
ఎడిటింగ్‌ బాగున్నాయి. ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే అక్కినేని రొమాంటిక్‌ హీరోగా అకిల్‌ని ఈ సినిమాలో చూడవచ్చు. . హాలీడేస్‌ టైమ్‌ కావడం, నాని ఎంసిఏ సినిమా పోటీ ఇవ్వలేకపోవడంతో అఖిల్‌ హలో సినిమాకి ఢోకా లేదు.

Tollybee రేటింగ్: 3/5

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *