ఇ ఈ మూవీ రివ్యూ

తెలుగు సినిమాల్లో ఎక్కువ వచ్చేది లవ్ జోనర్ లోనే వస్తు ఉంటాయి, ఎక్కువమంది కొత్త డైరెక్టర్ లు కూడా ఈ ఫార్ములాను నమ్మే హిట్ లు కొట్టారు. ఇప్పుడు అలాంటి జోనర్ లో వచ్చిన సినిమానే ఇ ఈ కూడా. నూతన దర్శకుడు రామ్ గణపతి రావ్ ప్రేమ కథను కొత్తగా… వింతగా… చెప్పే ప్రయత్నం చేసిన చిత్రం ఇ ఈ. అమ్మాయి, అబ్బాయి మధ్య ఈగోలు.. ఇష్టాల మధ్య సాగే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం రివ్యూ చూసేద్దాం.

కథేంటంటే…

సిద్ధు (నీరజ్ షా) ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అతని బాస్ ఎన్.కె.(సుధాకర్) కి అత్యంత విధేయుడు. ఇదిలా ఉంటే… అమ్మాయిలకు మాత్రం బాగా దూరం. వారంటే అస్సలు పడదు. తన జీవితంలోకి ఎలాంటి అమ్మాయి రాకూడదని దేవుళ్లకు మొక్కుతుంటాడు. ఓరోజు అనుకోని పరిస్థితుల్లో ఉన్నత కుటుంబానికి చెందిన హాసిని (నైరా షా) గొడవతో పరిచయం అవుతుంది. ఆమెనే అతనికి బాస్ అవుతుంది. అంటే ఎన్.కె కూతురు. హాసినికి, సిద్ధూకు తరచుగా గొడవలు జరుగుతుంటాయి. ఈ గొడవలో భాగంగా తపస్సు చేస్తున్న స్వామి ఎదురౌతాడు. అమ్మాయిలు మనసులో మాట్లాడుకునే మాటలు సిద్ధుకు వినపడేలా శపిస్తాడు. కొంతకాలం ఈ శాపాన్ని తనకు పాజిటివ్ గా మలుచుకుంటాడు సిద్ధు. అలా హాసినితో ప్రేమలో పడతాడు. ఇద్దరూ ప్రేమలో ఉంటారు. అయితే ఈ మనసులోని మాటలే తనకు సమస్యల్ని తెచ్చిపెడతాయి. మళ్లీ సాధువు దగ్గరికి వెళ్తాడు. సిధ్దు సోల్ ని హాసిని లోకి… హాసిని సోల్ ను సిద్ధులోకి పంపించి మాయమౌతాడు. అలా ఇద్దరి సోల్స్ మారిన తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి. ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు. మళ్లీ తమ సోల్స్ యాథాస్థితికి వచ్చేందుకు ఏం చేశారు. సాధువు మళ్లీ కనిపించాడా… తనను లోబర్చుకునేందుకు ట్రై చేస్తున్న అమ్మాయి నుంచి సిద్ధు ఎలా తప్పించుకున్నాడనేది అసలు కథ.

నటీనటుల పెర్ పార్మెన్స్. 

హీరో నీరజ్ షా… కన్నడలో సినిమాలు చేయడంతో… అతనికి నటన ఈజీనే అయ్యి ఉంటుంది. తెర మీద మధ్యతరగతి కుర్రాడి పాత్రకు సరిగ్గా సరిపోయాడు. అమ్మాయిలంటే ఇష్టంలేని మధ్య తరగతి కుర్రాడిగా సహజంగా నటించాడు. ప్రథమార్థంలో గెటప్ కు ద్వితాయర్థంలో గెటప్ కు సంబంధం ఉండదు. కానీ పాత్రల్ని బట్టి తనను తాను మార్చుకున్న తీరు బాగుంది. ఓ దశలో అమ్మాయి మ్యానరిజమ్స్ కూడా చూపించాలి. వాటిని బాగా ప్రదర్శించగలిగాడు. ఇక ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ హీరోయిన్ నైరా షా. జెనీలియా, హెభా పటేల్ లోని ఎనర్జీని చూపించింది. ప్రతీ సీన్ లో హీరోని డామినేట్ చేసేందుకు ట్రై చేసింది. అటు అందం, ఇటు గ్లామర్, అభినయంలో పూర్తి మార్కులు కొట్టేసింది.

సమీక్ష

తెలుగు తెరకు ఇది కొత్త సినిమానే. విభిన్నమైన కథ, వింత పాత్రలు. ప్రేక్షకుల ఊహకందని స్క్రీన్ ప్లే, హిలేరియస్ కామెడీ, అమ్మ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్, హీరో హీరోయిన్స్ నటన, గ్లామర్ పార్ట్ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తాయి. దర్శకుడు ప్రతీ సీన్ ను చాలా చక్కగా తీర్చిదిద్దగలిగాడు. క్వాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి బ్యూటిఫుల్ అవుట్ పుట్ రప్పించగలిగాడు. సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ కామెడీ. సెకండాఫ్ లో ప్రేక్షకులు ఊహించని సోల్స్ ఎక్స్ చేంజ్ అవ్వడం మేజర్ హైలైట్. అమ్మ సెంటిమెంట్ ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. హీరో తల్లితో, హీరో చెల్లితో వచ్చే సన్నివేశాల్ని దర్శకుడు బాగా రాసుకున్నాడు. ఇక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎనర్జిటిక్ గా ఉంటుంది.మాస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు ఐటమ్ సాంగ్ తో వేడెక్కించాడు. ఓవరాల్ గా దర్శకుడు రామ్ గణపతి రావ్ ఓ విభిన్నమైన ప్రేమ కథను అందించి ప్రేక్షకుల్ని మెప్పించాడు.

 

TollyBee.com Rating 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *