జై సింహా రివ్యూ & రేటింగ్ – First Review

బాలకృష్ణ నయనతార పెయిర్ కి మంచి లక్ ఉందని అందరికి తెలిసిందే, ఎప్పుడు జై సింహా తో మరిసారి అదే పెయిర్ సంక్రాంతికి కి మన ముందుకు వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం జై సింహా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం రండి !

బాలకృష్ణ కు ఉన్న సంక్రాంతి సెంటిమెంట్, నయనతార బాలయ్య పెయిర్ కు ఉన్న లక్ హరిప్రియ, నటాషా దోషి కలిసి నటించిన ఈ సినిమా కథలోకి వెళ్లేముందు బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యింది అనే చెప్పాలి. ఇక కథలోకి వెళ్తే ఈ సినిమాలో బాలకృష్ణ పేరు నరసింహ. బాలకృష్ణ కు తన కొడుకు అంటే అమితమైన ప్రేమ, ఈ ప్రేమ కారణంగానే ఉండే కాలనీ లో గొడవలు అయ్యినా మరేదైనా సమస్య ఉన్నా బాలకృష్ణ వివాదాలు లేకుండా ఉండే చోటుకు వెళ్లిపోతు ఉండేవాడు. ఒకసారి అలానే మారాల్సి వచ్చి కుంభకోణం కు వెళ్తాడు. అక్కడ తెలుగు వాళ్ళు అంటే స్వతహాగా ఇష్టపడే మరో తెలుగు వాడు అయ్యిన మురళి మోహన్ కు బాలకృష్ణ పరిచయం అవ్వడం తో బాలకృష్ణ ను తన ఇంటికి తీసుకుని వెళ్ళి తనదగ్గర డ్రైవర్ ఉద్యోగం ఇస్తాడు

. మురళి మోహన్ కూతురే మన సెకండ్ హీరోయిన్ నటాషా దోషి. ఈ అమ్మడు విదేశాల నుండి తిరిగి వచ్చి ఇక్కడ డ్రగ్స్ మందుకు అలవాటు అయి ఉంటుంది. అలానే ఒకరోజు తాగేసి కాలకేయ ప్రభాకర్ తమ్ముడిని గుద్దుతుంది. కాలకేయ ప్రభాకర్ కు తన తమ్ముడు అంటే విపరీతం అయ్యిన ఇష్టం. అయితే అతను ఏమి చేస్తాడో అని ఆక్సిడెంట్ చేసింది బాలకృష్ణ అని చెప్పి నమ్మిస్తారు. అది తెలుసుకున్న ప్రభాకర్ తన తమ్ముడుకి ఏమైనా అయితే చంపేస్తా అనడం తో గతం లో బాలకృష్ణ కు ఒక పోలీస్ ఆఫీసర్ తో గొడవలు ఉండటం తో అతను ప్రభాకర్ తమ్ముడిని చంపేస్తాడు. తమ్ముడు చనిపోతే ప్రభాకర్ బాలకృష్ణ ను చంపెస్తాదని అతని ఉద్దేశం. అయితే ఎట్టకేలకు తన తమ్ముడిని చంపేసింది బాలకృష్ణ కాదు అని పోలీస్ అని తెలియడం తో పోలీస్ కొడుకుని చంపడానికి భయలుదేరిన ప్రభాకర్ ను బాలకృష్ణ ఎదిరిస్తాడు ఒక్కడ ఒక ట్విస్ట్ తో ఇంటర్వెల్.

ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ, బ్రహ్మానందం, ప్రియ కామెడీ సీన్ లతో మూవీ సాఫీగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఆ ట్విస్ట్ రివీల్ చేయడం. అసలు బాలకృష్ణ ఎవరు ? బాలకృష్ణ దగ్గర ఉన్న కొడుకు ఎవరెవరికి పుట్టాడు. నయనతార ఎవరు ? నయనతార కు బాలకృష్ణ కు సంబంధం ఏంటి ? హరిప్రియ బాలకృష్ణ కు ఏమవుతుంది ఆన్నదే సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బాక్ లో బాలకృష్ణ యాక్షణ్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. విశేషం ఏంటి అంటే గత సినిమా కన్నా బాలకృష్ణ ఈ సినిమాలో మరింత యంగ్ గా మాన్లీ గా కనపడతాడు. హరిప్రియ నయనతార తమ తమ పాత్రలకు 100% న్యాయం చేసారు.

పెర్ఫార్మెన్స్: చిత్రం లో నటులు అందరు సీనియర్ నటులు కావడం తో ఎవరి పాత్రల్లో వారు అద్బుతంగా నటించారు. బ్రహ్మానందం సీనియర్ అయ్యినప్పటికి ఆయన కామెడీ అంతగా పండే పరిస్థితి లేదని అర్ధం అయ్యింది. బాలకృష్ణ ఆక్షన్, సెంటిమెంట్ సన్నివేశాల్లో పరకాయ ప్రవేశం చేసి నటించారు. బాలయ్యతో హీరోయిన్ లు అందరు సరైన జోడి అనిపించారు. విల్లన్ కూడా పవర్ ఫుల్ గా ఉండటం తో బాలకృష్ణ హీరోఇజం బాగా ఎలివేట్ అయ్యింది.

 

ప్లస్: బాలకృష్ణ , నయనతార హరిప్రియ, కథలోని ట్విస్ట్ లు, యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , సినిమాటోగ్రఫి.

మైనస్ : ఫస్ట్ హాఫ్ లో బ్రహ్మానందం కామెడి అనవసరం అనిపిస్తుంది, మొదట్లో కాస్త స్లో గా సాగినా స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ చివరికి ఊపు అందుకుంటుంది.

TollyBee Rating: 3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *