మహేష్ కత్తి 6 ప్రశ్నలకు ఆన్సర్స్ వచ్చేశాయి !

సినీ క్రిటిక్ కత్తి మహేశ్ నటి పూనం కౌర్‌‌, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్‌కు సంబంధించి ఆరు ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రశ్నల పరంపర నుంచి తనను ఆదుకోవాలంటూ పూనం.. పవన్‌ను సాయం కోరింది. అయితే కొద్దిసేపటికే ఈ ట్వీట్స్‌ను పూనం ట్విట్టర్ నుంచి తొలగించింది. కాగా ఇదే వ్యవహారంపై పూనం కౌర్‌ సోదరుడు శ్యామ్‌సింగ్ స్పందించి కత్తి ఆరోపణలను తిప్పి కొట్టాడు. ఓ చానెల్‌తో శ్యామ్‌సింగ్ మాట్లాడుతూ కత్తి వేసిన ప్రశ్నలకు దాదాపు సమాధానమిచ్చాడు. ప్రశ్నల వారిగా చూస్తే..

1..కత్తి ప్రశ్న: మీకు బ్రాండ్ అంబాసిడర్‌గా పదవి ఎవరి వల్ల వచ్చింది?
శ్యామ్ సమాధానం: పూనం కౌర్ నిఫ్ట్‌లో చదువుకుంది. పూనంకు చేనేతపై పూర్తిగా అవగాహన ఉంది. గత మూడేళ్లుగా ఆమె చేనేతపై ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. పూనం కృషి చూసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టారు.

2..కత్తి ప్రశ్న: తిరుమలలో పవన్ కల్యాణ్‌తో పాటు నిలబడి ఒకే గోత్రనామాలతో పూజ ఎందుకు చేయించుకున్నారో చెప్పగలారా?
శ్యామ్ సమాధానం: మేం పంజాబిలం, తెలుగువాళ్ల మాదిరిగా దేవుడి ముందు ప్రమాణం చేయం. పూనం ఎప్పుడు తిరుపతి వెళ్లినా మేం వెంట వెళ్లాం. పవన్‌తో కలిసి పూనం ఎప్పుడూ దేవాలయాలకు వెళ్లలేదు.

3..కత్తి ప్రశ్న: పవన్ మోసం చేశాడని మీరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే.. మిమ్మల్ని కాపాడిందెవరు? మీరున్న ఆస్ప్రతి ఏంటి? ఆ బిల్లు కట్టిందెవరు?
శ్యామ్ సమాధానం: పవన్ మాకు ఎలాంటి సాయం చేయలేదు. మాకు ఎవరి సాయం అవసరం లేదు.

4..కత్తి ప్రశ్న: పవన్ కల్యాణ్ మీ అమ్మగారిని కలిసి ఏం ప్రామిస్ చేశారు? ఇప్పటి వరకు అది నెరవేర్చారా లేదా?
శ్యామ్ సమాధానం: పవన్ మాకు ఎలాంటి సాయం చేయలేదు. మాకు ఎవరి సాయం అవసరం లేదు.

5..కత్తి ప్రశ్న: డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారంటే మీకెందుకు అంత కోపం?
శ్యామ్ సమాధానం: త్రివిక్రమ్‌తోనే కాదు టాలీవుడ్‌లో ఏ దర్శకుడితోనూ మాకు విభేదాలు లేవు.

6.. కత్తి ప్రశ్న: ఒక క్షుద్ర మాంత్రికుడు నర్సింగం చేసిన క్షుద్రపూజేంటి? త్రివిక్రమ్, పవన్‌తో కలిపి పూజ చేస్తున్నప్పుడు అక్కడ మీరేం చేశారో చెప్పగలరా?
శ్యామ్ సమాధానం: పూనం కౌర్‌ను అవమానించిన కత్తి మహేష్ పై పురువు నష్టం దావా వేస్తామని తెలిపారు. పూనం కౌర్ ఎప్పుడూ కత్తి మహేశ్ పేరు తీయలేదు. ఆమెను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారు అని సీరియస్‌గా చెప్పాడు శ్యామ్ సింగ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *