మళ్ళి చెప్పను బ్రదర్ అంటున్న బన్నీ

చూడటానికి ఒకటిలా కనిపించినా మెగా ఫాన్స్ అంతా ఒకటి కాదు అనే విషయం అందరికి తెలిసిందే. బన్నీ చేసే కామెంట్స్ పవన్ ఫాన్స్ ని ప్రతిసారి ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. మొదటి నుండి మెగా ఫాన్స్ అందు పవన్ ఫాన్స్ వేరయా అనేలానే ఉండేది. ఇప్పుడు అదే మరొక్కసారి రుజువు అయ్యింది. పవన్ కళ్యాణ్ కొండగట్టు నుండి చేస్తున్న యాత్రకు ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి అభినందనలు వచ్చాయి.

కానీ అల్లు వారి ఫ్యామిలీ నుండి ఎటువంటి స్పందన లేదు. తాజాగా చాలా సార్లు పవన్ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడే అల్లు వారిది కూడా ఏదో ఒక ట్రైలర్ రిలీజ్ చేయడం పవన్ ఫాన్స్ ని నొప్పించేది. కాని ఇప్పుడు పవన్ పాదయాత్రను అభినందిన్చకపోవడం చూస్తుంటే మెగా ఫ్యామిలీ కి అల్లు ఫ్యామిలీ నుండి సపోర్ట్ లేదనే చెప్పాలి.

అల్లు అర్జున్ గతం లో కూడా పవన్ పై చేసిన చెప్పను బ్రదర్ అన్న కామెంట్స్ మరొకసారి గుర్తుకు వస్తున్నాయి. ఏది ఏమైనా పార్టీ లకు అతీతంగా పవన్ ను అందరు అభినందించారు. పవన్ చేస్తున్న మొట్ట మొదటి యాత్ర కావడం కూడా అందుకు కారణం అయ్యి ఉండవచ్చు. చూద్దాం ఇప్పటికి అయ్యినా అల్లు వారి ఫ్యామిలీ నుండి పవన్ యాత్రపై కామెంట్ వస్తుందో రాదో…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *