నగ్నంగా బాలయ్య హీరోయిన్ !

సౌత్ గ్లామర్ సెన్సేషన్ లక్ష్మీ రాయ్ ‘జూలీ 2’ సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగు పెడుతోంది. బాలీవుడ్ తొలి ప్రయత్నంలోనే తన సెక్సీ అందాలకు బాగా సూటయ్యే సినిమాను ఎంచుకున్న ఈ బ్యూటీ సౌత్ ప్రేక్షకులు ఇప్పటి వరకు ఊహించని బోల్డ్ అవతారంలో కనిపించబోతోంది. గతంలో నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ ‘జూలి’కి సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న ‘జూలీ 2’ చిత్రాన్ని శివ‌దాసాని రూపొందిస్తున్నాడు. అక్టోబ‌ర్ 6న సినిమా విడుదల కాబోతోంది.

అయితే ఈ సందర్భంలో తాజాగా విడుదలైన ట్రైలర్ లక్ష్మీరాయ్ అభిమానుల మతి పోగొడుతోంది. లక్ష్మీరాయ్ ఈ చిత్రంలో బోల్డ్‌గా నటిస్తుందని, బికినీల్లో అందాలు ఆరబోస్తుందని అందరూ ఊహించారు. అయితే ఇందులో ఆమె న్యూడ్ సీన్లు, ముద్దు సీన్లు కూడా చేసి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది.

ఈ సినిమా విడుదల తర్వాత బాలీవుడ్ తెరపై సరికొత్త గ్లామర్ హీరోయిన్‌గా కీర్తింపబడుతుందని, ఆ సినిమా తర్వాత ఆమెను అంతా లక్ష్మీరాయ్ బదులు సెక్సీ రాయ్ అని పిలుస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి మరి.

ఇక సినిమా విషయానికి వస్తే బాలీవుడ్ చీక‌టి కోణాలతో పాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్ మ‌రియు రాజ‌కీయాల‌లో ఉన్న న‌గ్న స‌త్యాన్ని తెలిపేలా ఈ మూవీ ఉంటుంద‌ని అంటున్నారు. ఒక సాధారణ అమ్మాయి స్టార్ గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సంఘటనలు తరచూ వింటూనే ఉన్నాయి. సినిమా అవకాశాల కోసం హీరోయిన్లను లైంగికంగా లొంగదీసుకోడం లాంటి సంఘటనలు ‘జూలీ 2′ సినిమాలో చూపిస్తారని తెలుస్తోంది. ట్రైలర్ ఈ చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ తో పాటు ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్త‌వ‌, ర‌వి కిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

ఈ ముద్దుగుమ్మ ఇక్కడ లక్కీ రాయి అనిపించుకుంటే అక్కడ సెక్సీ రాయి అనిపించుకుంటుందేమో చూడాలి !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *